బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 ఆగస్టు 2023 (18:39 IST)

చరిత్ర సృష్టించిన భారత్.. జాబిల్లి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా రికార్డు

vikram lander
భారత్ మరో చరిత్ర సృష్టించింది. చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా, చైనా, రష్యాలాంటి దేశాలు సైతం ఇప్పటివరకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టలేదు. తాజాగా చంద్రయాన్‌ -3 ప్రయోగం విజయవంతం కావడంతో చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా చరిత్ర సృష్టించింది. 
 
చందమామపై పరిశోధనలు జరిపేందుకు అంతరిక్షంలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్‌ ల్యాండర్ దిగింది. 14 రోజులపాటు చంద్రుడిపై పరిశోధనలు జరుపనుంది. చంద్రుడి దక్షిణ ధ్రువం పూర్తిగా బిలాలు, అగాథాలతో కూడుకున్నది. 
 
ఇక్కడ అడుగుపెట్టడం కష్టమైన పని. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగేందుకు రష్యా ఇటీవల లూనా-25 వ్యోమనౌకను ప్రయోగించగా అది చంద్రుడి ఉపరితలంపై కుప్పకూలింది. తాజాగా చంద్రయాన్‌ 3 దక్షిణ ధ్రువంపై సేఫ్‌గా దిగి సంచలనం సృష్టించింది. ప్రపంచ దేశాలను సైతం ఆశ్చర్యపరిచింది.