గురువారం, 12 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 ఆగస్టు 2023 (18:46 IST)

చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం - విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్(Video)

vikram lander
అంతరిక్షంపై భారత్‌ సంచలనం సృష్టించింది. చందమామపై పరిశోధనలు జరిపేందుకు అంతరిక్షంలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌ -3 ప్రయోగం విజయవంతమైంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్‌ ల్యాండర్ దిగింది.
 
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైంది. విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా జాబిల్లిపై అడుగుపెట్టింది. ఈ ల్యాండింగ్ ప్రక్రియ బుధవారం సాయంత్రం గం.5.44 నిమిషాలకు ప్రారంభమైంది. చంద్రుడి ఉపరితలం వైపుగా విక్రమ్ ల్యాండర్ ప్రయాణం ప్రయాణించి సురక్షితంగా దిగింది. 
ఈ ప్రయోగం మొత్తం బెంగళూరు కేంద్రంలో శాస్త్రవేత్తలు క్షణం క్షణం ఉత్కంఠతో పరిస్థితిని అంచనా వేశారు. చంద్రయాన్-3 ప్రయోగాన్ని దేశవ్యాప్తంగా అనేక పాఠశాలల్లో విద్యార్థులు చూసేందుకు ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లు చేశారు. చంద్రయాన్ సాఫ్ట్ ల్యాండింగ్‌పై దేశవ్యాప్తంగా.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. 
 
చంద్రుడి దక్షిణ ధ్రువం పూర్తిగా బిలాలు, అగాథాలతో కూడుకున్నది. ఇక్కడ అడుగుపెట్టడం కష్టమైన పని. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగేందుకు రష్యా ఇటీవల లూనా-25 వ్యోమనౌకను ప్రయోగించగా అది చంద్రుడి ఉపరితలంపై కుప్పకూలింది. తాజాగా చంద్రయాన్‌-3 దక్షిణ ధ్రువంపై సేఫ్‌గా దిగి సంచలనం సృష్టించింది.