1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 ఆగస్టు 2023 (12:00 IST)

ల్యాండింగ్‌కు జస్ట్ ఒకే ఒక్క బటన్‌ దూరంలో చంద్రయాన్-3

Chandrayan
చంద్రయాన్ -3 అద్భుతంగా పనిచేస్తుంది. ల్యాండింగ్‌కు జస్ట్ ఒకే ఒక్క బటన్‌ దూరంలో వుంది. ప్రస్తుతం చంద్రుడి ఉపరితలానికి 70 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో తిరుగుతున్న చంద్రయాన్ 3 చాలా చక్కగా పనిచేస్తుందని ప్రకటించింది. 
 
ఇప్పటివరకు అనుకున్నది అనుకున్నట్లుగానే పనిచేస్తూ ల్యాండర్ నుంచి కొత్త ఫోటోలను పంపించింది. చంద్రుడి దక్షిణ ధృవంలో ల్యాండ్ కాబోయే చంద్రయాన్ 3 పంపించిన లేటెస్ట్ ఫోటోలు ప్రపంచాన్ని ఔరా అనిపిస్తున్నాయి.  
 
కాగా,గత నెల 14వ తేదీన తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ నుంచి చంద్రయాన్ 3 ని ఇస్రో ప్రయోగించిన విషయం తెలిసిందే. 2019లో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైన నేపథ్యంలో ఈ మూన్ మిషన్‌ను ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.