ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 ఆగస్టు 2023 (13:22 IST)

స్నానం చేస్తుంటే న్యూడ్‌గా శరీరాన్ని షూట్ చేశాడు.. భర్తపై రాఖీ సావంత్ ఆరోపణలు

rakhi sawanth
తన భార్యననే కనీస జ్ఞానం కూడా లేకుండా తాను బాత్రూమ్‌లో స్నానం చేస్తుంటే తనను న్యూడ్‌గా షూట్ చేశాడంటూ తన మాజీ భర్త ఆదిల్ దుర్రానీపై బాలీవుడ్ నటి రాఖీ సావంత్ సంచలన ఆరోపణలు చేశారు. కొంతకాలం ఆదిల్‌ను ప్రేమలో మునిగితేలిన రాఖీ సావంత్.. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. కొంతకాలానికి వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో వేరుపడ్డారు. దీంతో వారిద్దరూ విడిపోయారు. 
 
ఈ క్రమంలో తన మాజీ భర్తపై రాఖీ సావంత్ సంచలన ఆరోపణలు చేసింది. ఆదిల్ తన నిధులను దుర్వినియోగం చేశాడని, గృహ హింసకు పాల్పడ్డాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసి అతడిని జైలుకు కూడా పంపించింది. అనంతరం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆదిల్ సైతం రాఖీపై సంచలన ఆరోపణలు చేశాడు.
 
దీంతో ఆగ్రహించిన రాఖీ సావంత్ మరో అడుగు ముందుకు వేసి.. ఆదిల్ తన న్యూడ్ వీడియోలను రూ.47 లక్షలకు దుబాయిలో విక్రయించాడని ఆరోపించింది. 'నేను బాత్ రూమ్‌లో ఉన్నాను. అతడు షూట్ చేశాడు. అలాంటివి బోలెడు వీడియోలు ఉన్నాయి. నా శరీరం మొత్తం న్యూడ్‌గా కనిపిస్తోంది. నేను అతడి భార్యను. అతడు నాపై అత్యాచారం చేశాడు. వీడియోలు వైరల్ అవుతున్నాయి. నేను ఏం చేయాలి? ఎక్కడికి వెళ్లాలి? ప్రపంచం అంతా నా వీడియోలను చూసిన తర్వాత నేను ఎక్కడికి వెళ్లాలి? ప్రపంచానికి నా ముఖాన్ని ఎలా చూపించాలి? నేను సాధారణ అమ్మాయిని కాదు. భారత్‌లో సెలబ్రిటీని. విషం తాగి ఆత్మహత్య చేసుకోవాలా?' అంటూ రాఖీ సావంత్ వాపోయింది. .