మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 నవంబరు 2022 (16:07 IST)

బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్స్ మధ్య వార్.. అసలు సంగతేంటి?

sherlyn chopra
బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్స్ రాఖీ సావంత్, షెర్లిన్ చోప్రా పోలీస్ స్టేషన్ గడపతొక్కారు. ఇద్దరూ పరస్పరం లైంగిక వేధింపులు, పరువు నష్టం ఫిర్యాదులు చేసుకున్నారు. నిర్మాత సాజిద్ ఖాన్‌పై షెర్లిన్ చోప్రా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన తర్వాత ఆమెకు, రాఖీకి మధ్య వార్ మొదలైంది. 
 
నిర్మాత సాజిద్‌కు రాఖీ మద్దతిచ్చింది. ప్రతిగా షెర్లిన్ కూడా సావంత్‌ను తిట్టిపోసింది. అలాగే రాఖీ సావంత్ కూడా ఆమె లాయర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రాఖీ సావంత్‌పై పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 
 
ఇకపోతే.. రాఖీ సావంత్, మీడియాతో మాట్లాడుతూ, సాజిద్ ఖాన్‌పై ఆమె చేసిన ఆరోపణలకు సంబంధించి చోప్రాపై పరువు నష్టం కలిగించే, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రతిగా, షెర్లిన్ చోప్రా విలేకరులతో మాట్లాడుతూ సావంత్‌పై తిట్టిపోసింది. ఈ వార్ ప్రస్తుతం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.