బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (12:55 IST)

వాలెంటైన్స్ డే : రాఖీ సావంత్ బాంబు - భర్తకు బైబై

బాలీవుడ్ నటి రాఖీ సావంత్ బాంబు పేల్చారు. తన భర్తతో తెగదెంపులు చేసుకోనున్నట్టు ప్రకటించారు. బిగ్ బాస్ రియాల్టీ షో తర్వాత చాలా పరిణామాలు జరిగాయని చెప్పుకొచ్చింది. అయితే, తన భర్తతో విడిపోవడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల దినోత్సవానికి పురస్కరించుకుని ఆమె కీలక ప్రకటన చేసింది. 
 
"ప్రియమైన ఫ్యాన్స్, శ్రేయోభిలాషులకు... నేను రితేష్ విడిపోవాలని నిర్ణయించుకున్నాం. బిగ్ బాస్ షో తర్వాత చాలా ఘటనలు జరిగాయి. వాటిలో కొన్ని నేను నియంత్రించలేనివి. సమస్యలను పరిష్కరించుకునేందుకు నేను రితీష్ చాలా చర్చించాం. కానీ, ఆ చర్చలు ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. అందుకే ఇకపై ఎవరి జీవితం వాళ్లదే అని నిర్ణయించుకుని, సంతోషాగం విడిపోవాలని డిసైడ్ అయ్యాం" అని చెప్పారు.