శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 జులై 2022 (15:53 IST)

మోదీ నా జీవితాన్ని నాశనం చేశాడు.. రాఖీ సావంత్

rakhi sawanth
ప్రధాని నరేంద్ర మోదీపై ఐటెం బాంబ్ రాఖీ సావంత్ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ తన జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపించింది. మోదీ చేసిన పని వల్ల రెండు రోజులుగా నిద్ర లేదని చెప్పుకొచ్చింది. 
 
ఈ బూస్టర్ డోస్ వయాగ్రా మాదిరిగా అనిపిస్తుందన్న బోల్డ్ బ్యూటీ.. 60 ఏళ్లు దాటిన వృద్ధులకు మాత్రమే ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడింది.
 
ఈ మధ్య బూస్టర్ డోస్ వేసుకున్నప్పటి నుంచి నిద్ర పట్టడం లేదని, గుండె చాలా వేగంగా కొట్టుకుంటోందని తెలిపింది. అరగంట కూడా నిద్రపట్టక పోవడంతో పూర్తిగా అలసిపోయానని, ముఖం వాచిపోయిందని వివరించింది. ప్రస్తుతం బ్యాడ్ పొజిషన్‌లో ఉన్న తను.. బాయ్ ఫ్రెండ్ ఆడిల్ కోసం వెతుకుతున్నానని చెప్పుకొచ్చింది.