సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 జులై 2022 (11:02 IST)

ముందంజలో రిషి సునక్: జూలై 21 వరకు ప్రక్రియ కొనసాగింపు

Rishi Sunak
బ్రిటన్ ప్రధానమంత్రి, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి రేసులో భారత సంతతికి చెందిన రిషి సునక్ ముందంజలో ఉన్నారు. తక్కువ ఓట్లు పోలైన ఎంపీ టామ్ టుగెండ్‌హమ్ ఈ రేసు నుంచి తప్పుకున్నారు. 
 
రిషి సునక్ తర్వాత వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డెంట్ రెండో స్థానంలో, విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ మూడో స్థానంలో ఉండగా, కేమీ బడెనోచ్ నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు.
 
జూలై 14న జరిగిన ఓటింగ్‌లో కూడా ఈ నలుగురే తొలి నాలుగు స్థానాల్లో నిలిచారు. అప్పుడు రుషి సునక్ 101 ఓట్లతో అందరి కంటే ముందంజలో ఉండగా, మూడో రౌండ్‌లో ఆయనకు 115 ఓట్లు పోలయ్యాయి.
 
మంగళవారం ఈ నలుగురు అభ్యర్థులకు మరోసారి ఓటింగ్ జరగనుంది. చివరగా ఇద్దరు అభ్యర్థులు మిగిలేంత వరకు ఈ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంటుంది. జూలై 21 వరకు ఈ ప్రక్రియ సాగే అవకాశం ఉంది.
 
చివరకు కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు, పోస్టల్ ఓటు ద్వారా పార్టీ నాయకుడిని ఎన్నుకుంటారు. కొత్త ప్రధానిని సెప్టెంబర్ 5న ప్రకటిస్తారు.