శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 ఆగస్టు 2023 (12:39 IST)

కోడలిపై కన్నేసిన భర్తను చంపేసిన భార్య.. ఎక్కడ?

murder
తమ ఇంటి కోడలిపై కన్నేసిన కట్టుకున్న భర్తను భార్య చంపేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదాయూ పట్టణంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ ప్రాంతానికి చెందిన తాళ్ల వ్యాపారి తేజేంద్ర సింగ్‌, మిథిలేశ్ దేవి అనే దంపతులకు నలుగురు పిల్లలు. ఈయన గత నెల 14వ తేదీ తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో తేజేంద్రను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
అయితే, తేజేంద్ర భార్య మిథిలేష్ దేవి చెప్పిన మాటల్లో పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో ఆమెను కస్టడీలోకి తీసుకొని విచారించారు. దుఃఖం ఆపుకోలేకపోయిన ఆ ఇల్లాలు అసలు విషయం పోలీసులకు చెప్పేసింది. జితేంద్ర రోజూ తాగి వచ్చి ఆమెను కొట్టేవాడు. చాలా రోజులుగా ఈ నరకం భరిస్తూ వచ్చింది. కుమారుడి భార్యపై కన్నేసిన జితేంద్ర.. తనతో లైంగిక సంబంధానికి కోడలిని ఒప్పించమని భార్యను బలవంతం చేయడం మొదలుపెట్టాడు. 
 
తనకు సహనం నశించిన మిథిలేశ్ దేవి భర్తను వదిలించుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. ఆగస్టు 13వ తేదీ రాత్రి విపరీతంగా తాగి వచ్చి గొడవ పెట్టుకొన్న జితేంద్ర ఇంటి బయట మంచంపై పడుకున్నాడు. ఇదే అదనుగా భావించిన ఆమె కొడవలితో గొంతు కోసి భర్తను హత్య చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.