సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2023 (16:17 IST)

శ్రీవారి సన్నిధిలో 'దేవర' హీరోయిన్

Jhanvi Kapoor
Jhanvi Kapoor
దివంగత నటి శ్రీదేవి ముద్దుల కుమార్తె, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ సోమవారం శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనం కోసం ఆమె లంగా ఓణీలో అచ్చ తెలుగు అమ్మాయిగా తిరుమలకు వచ్చారు. 
 
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంప్రదాయబద్ధంగా లంగా ఓణీలో వచ్చిన జాన్వీ... ఈ దఫా రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. గతంలో ఆమె అలిపిరి నడక మార్గంలో కూడా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. 
Jhanvi Kapoor
Jhanvi Kapoor
 
కాగా, ప్రస్తుతం జాన్వీ కపూర్ తెలుగులో ఓ చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న "దేవర" చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో జాన్వీ కపూర్ శ్రీవారి దర్శనానికి రావడం గమనార్హం.