శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 3 జులై 2023 (10:12 IST)

దేవరలో ఎన్‌.టి.ఆర్‌. కొత్త లుక్‌ అప్‌డేట్‌

NTR new look
ఎన్‌.టి.ఆర్‌. నటిస్తున్న తాజా సినిమా దేవర. కొరటాల శివ దర్శకుడు. ఈ సినిమాలో రెండు పాత్రలు పోషిస్తున్నాడు ఎన్‌.టి.ఆర్‌. మొదటి లుక్‌ ఇటీవలే విడుదలచేశారు. సముద్రంతో గండ్రగొడ్డలి పట్టుకుని సముద్ర దొంగలపై దాడిచేసే సముద్రవీరుడుగా చూపించారు. తాజాగా మరో కొత్త లుక్‌ను విడుదలచేస్తే అభిమానులు సూపర్‌ అంటూ సోషల్‌ మీడియాలో కితాబిస్తున్నారు. ఈ లుక్‌లో కాషాయ దుస్తులు ధరించి మెడలో రుద్రాక్షలు ధరిస్తూ, గెడ్డం, మీసం విపరీతంగా పెంచి వున్న ఈ లుక్‌ సరికొత్తగా కనిపిస్తుంది. 
 
సముద్రతీరంలో జరిగే కథ కనుక ఇందులో యాక్షన్‌ సన్నివేశాలను హాలీవుడ్‌ ఫైటర్లు, మన ఫైటర్ల సమన్వయంతో చేస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్‌ నటిస్తోంది.  తర్వాత కొరటాల, ఎన్‌.టి.ఆర్‌. కలిసి చేస్తున్న చిత్రమిది. ఇప్పటికే కొరటాలకు నటించిన సినిమా పెయిల్‌ కావడంతో ఎన్‌.టి.ఆర్‌.పై ఆశలు పెట్టుకున్నారని తెలుస్తోంది.