గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 22 మే 2023 (21:27 IST)

నైకా నేచురల్స్ ప్రచారకర్తగా జాన్వీ కపూర్‌

Jhanvi Kapoor
భారతీయ జుట్టు సమస్యలను పరిష్కరించడానికి సాంప్రదాయకంగా ప్రభావవంతమైన పదార్థాలతో కూడిన పవర్ ప్యాక్డ్ మిశ్రమాన్ని ముందుకు తీసుకువస్తూ, నైకా నేచురల్ హెయిర్ జాన్వీ కపూర్‌ను తమ ప్రచారకర్త గా తీసుకుని కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. హెయిర్ కేర్ యొక్క భారతీయ ఆచారాలలో పుట్టి, పాతుకుపోయిన నైకా నేచురల్స్ కఠినమైన నీరు, కాలుష్యం, తేమ, యువి కిరణాలు, దుమ్ము మరియు ధూళి వంటి విభిన్న భారతీయ పర్యావరణ పరిస్థితుల కారణంగా కలిగే నష్టం గుర్తించటం తో పాటుగా భారతీయ జుట్టు రకాలు మరియు సాధారణ ఆందోళనలను పూర్తిగా అర్థం చేసుకుంది. భారతీయ జుట్టుకు ప్రత్యేక శ్రద్ధ అవసరమని గుర్తించిన నైకా నేచురల్ ఈ పర్యావరణ ఒత్తిళ్లను ఆరు పవర్-ప్యాక్డ్ ఫార్ములేషన్‌ల ద్వారా ఎదుర్కొంటుంది, ఇవి పరిశోధనల తో సంప్రదాయ జుట్టు సంరక్షణ నివారణలను  మిలితం చేసుకుని ఉంటాయి.
 
నైకా కుటుంబానికి కొత్తేమీ కాదు, కానీ, జాన్వీ కపూర్ బ్రాండ్‌ కు ప్రచారకర్త గా సరిగ్గా సరిపోతుంది, ఆమె అద్భుతమైన చర్మం మరియు స్వదేశీ పదార్థాల పట్ల ఆమె ప్రేమతో కూడిన అనుబంధానికి పేరుగాంచింది. నైకా నేచురల్ హెయిర్ కేర్ శ్రేణి యాపిల్ సైడర్ వెనిగర్, అల్లం, మెంతులు, ఉల్లిపాయలు, ఉసిరికాయ, కరివేపాకు, పులియబెట్టిన రైస్ వాటర్, బొగ్గు మరియు షికాకాయ్ మొదలైన సాంప్రదాయక జుట్టును ఇష్టపడే పదార్థాలతో నింపబడి ఉంది, ఇవన్నీ జుట్టుకు పూర్తి సూపర్ ఫుడ్స్. నిపుణుల మద్దతుతో అనుకూలీకరించిన సొల్యూషన్, నైకా నేచురల్ హెయిర్ శ్రేణి భారతీయ వాతావరణం, నీరు, జీవనశైలి మరియు విభిన్న జుట్టు రకాలను విశ్లేషించి అందంగా ఆరోగ్యకరమైన జుట్టు కోసం సమర్థవంతమైన పదార్ధాల శక్తివంతమైన ఇన్ఫ్యూషన్‌ను రూపొందించడానికి అభివృద్ధి చేయబడింది. ఇండియన్ హెయిర్ కేర్= నైకా నేచురల్ హెయిర్ కేర్ అనే ప్రధాన సందేశంపై దృష్టి సారించే బ్రాండ్ ఫిల్మ్ ద్వారా ఆన్‌సైట్, డిజిటల్ మరియు సోషల్ మీడియా ప్రచారాలతో జాన్వి యొక్క అనుబంధం ఈ ప్రచారంలో కనిపిస్తుంది.
 
నైకా యొక్క కన్స్యూమర్ బ్యూటీ బ్రాండ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ విశాల్ గుప్తా మాట్లాడుతూ, “తీవ్రమైన భౌగోళిక వాతావరణ పరిస్థితుల కారణంగా భారతీయ జుట్టు చాలా భిన్నంగా ఉంటుంది. ఒక ఉత్పత్తి అందరికీ సరిపోదు. నైకా నేచురల్‌తో, మా బృందం శతాబ్దాల క్రితం నాటి జుట్టు సంరక్షణ ఆచారాలను ఆధునిక శాస్త్రంతో మిళితం చేసి ఈ ఉత్పత్తులను అభివృద్ధి చేసింది. జాన్వీ కపూర్ బ్రాండ్ యొక్క వ్యక్తిత్వానికి సరిగ్గా సరిపోతుంది కాబట్టి మా మొదటి ఎంపికగా ఆమె నిలిచారు. ఆమె అందమైన జుట్టు మరియు సహజ పదార్ధాలను ఉపయోగించడం మరియు వాటిని విశ్వసించడం పట్ల ఆమె మూలాలతో కూడిన అనుబంధం, ఆమె బ్రాండ్‌కు ప్రాతినిధ్యం వహించాలని మేము కోరుకోవడానికి ప్రధాన కారణం." అని అన్నారు.
 
జాన్వీ కపూర్ మాట్లాడుతూ, "నేను చిన్నప్పటి నుండి ఇంట్లో ప్రాక్టీస్ చేయడం చూశాను కాబట్టి, శరీరంపై సహజమైన పదార్థాలను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలపై నాకు గట్టి నమ్మకం ఉంది. నాకు సమయం దొరికినప్పుడు, ఆపిల్ సైడర్ వెనిగర్ లేదా ఉల్లిపాయను అప్లై చేయడం ద్వారా నా జుట్టును నేను ఇప్పటికీ జాగ్రత్త గా చూసుకుంటాను. నేను విశ్వసించే దేనినైనా సూచించే అవకాశం వచ్చినప్పుడు, నాకు పూర్తిగా నమ్మకం కలగాలి. నైకా నేచురల్ హెయిర్ శ్రేణి అనేది సహజ పదార్థాల వినియోగాన్ని మరింత అధునాతనంగా పునరావృతం చేయాలనే ఆలోచనతో ప్రతిధ్వనిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషణతో జుట్టును తీర్చిదిద్దుతుంది" అని అన్నారు.