సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 13 మే 2023 (11:53 IST)

ఎన్‌.టి.ఆర్‌.30 తాజా అప్‌డేట్‌ బయటపెట్టారు

NTR30 1st look poster
NTR30 1st look poster
ఎన్‌.టి.ఆర్‌.30 సినిమాకు సంబంధించిన వార్త ఏదో ఒకటి సోషల్‌ మీడియాలో చిత్ర నిర్మాణ సంస్థ పోస్ట్‌ చేస్తూనే వుంది. ఈరోజు మటుకు ఎన్‌.టి.ఆర్‌.30 ఫస్ట్‌లుక్‌ అంటూ యాక్షన్‌ సీన్‌ లో వాడే ఆయుధాలను రోడ్డుమీద వుంచి నిర్మానుష్యంగా వున్న ప్రాంతాన్ని చూపించింది. ఈనెల 19న ఎగ్జైట్‌మెంట్‌ టైటిల్‌ను ప్రకటించనున్నామని తెలిపింది.
 
విదేశాల్లో యాక్షన్‌ సీన్స్‌ తీస్తున్న ఛాయలు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో కనిపించాయి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్‌ బేనర్‌పై రూపొందిస్తున్నారు. అనిరుధ్‌ బాణీలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే జాన్వీకపూర్‌, సైఫ్ అలీఖాన్‌, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్నట్లు వారికి సంబంధించిన స్టిల్స్‌ కూడా బయటకు వచ్చాయి. వచ్చే గురువారంనాడు అమావాస్యనాడు సినిమా టైటిల్‌ ప్రకటించాలనుకోవడం ప్రత్యేకత సంతరించుకుంది.