గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 మే 2023 (12:00 IST)

అఖిల్ అక్కినేనితో జాన్వీ కపూర్ రొమాన్స్.. ఈ సినిమా అయినా కలిసొస్తుందా?

jhanvi kapoor
అక్కినేని అఖిల్‌కు ఏజెంట్ సినిమా అంతగా కలిసిరాలేదు. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో అఖిల్ నిరాశకు గురైనట్లు సమాచారం. అందం, అభినయం వున్నా సక్సెస్ లేకపోవడం అఖిల్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఏజెంట్ నిర్మాత అనిల్ సుంకర, బాక్సాఫీస్ వద్ద చిత్రం పేలవమైన ప్రదర్శనకు సంబంధించి క్షమాపణలు చెప్పారు. తాజాగా అఖిల్ అక్కినేనిని సంబంధించిన తాజా అప్డేట్ టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. 
 
సాహో టీమ్‌లలో భాగమైన UV క్రియేషన్స్ ప్రాజెక్ట్‌లో పని చేయడానికి అఖిల్ అక్కినేని చర్చలు జరుపుతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. ఈ చిత్రంలో అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ రాబోయే చిత్రంలో కథానాయికగా నటిస్తుందని ఇంకా ఆమె పేరు ఖరారు కాలేదని తెలుస్తోంది. ఇది నిజమైతే.. జాన్వీ కపూర్ తెలుగు చిత్రసీమలో ఆమె చేసే రెండో సినిమా ఇదే అవుతుంది.
 
నిజానికి, జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ చిత్రం, #NTR30తో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టనుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్ చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.