బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (22:47 IST)

దక్షిణాదిన ఉస్తాద్ భగత్ సింగ్.. బాలీవుడ్‌లో జాన్వీ కపూర్..?

jhanvi kapoor
బాలీవుడ్‌లో థెరి రీమేక్‌లో శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ నటించనుంది. జాన్వీ ప్రస్తుతం సినిమాలతో బిజీ బిజీగా వుంది. ఇంకా తన హాట్ హాట్ అందాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటుంది. త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. జాన్వీ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేస్తోంది.
 
తాజాగా తమిళంలో హిట్ అయిన థెరి సినిమా బాలీవుడ్ రీమేక్‌లోకి జాన్వీ నటించనున్నట్లు టాక్ వస్తోంది. ఈ చిత్రంలో వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. అట్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది.   
 
కాగా.. విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తేరి. ఇదే సినిమా పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్‌గా టాలీవుడ్‌లో రీమేక్ అవుతోంది. 
 
ఇక బాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా తెరి సినిమా రీమేక్ ద్వారా పలకరించనుంది. ఇందులో జాన్వీ కనిపించనుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి.