సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (14:05 IST)

రవితేజ రావణాసుర రీమేక్ సినిమానా! సుధీర్‌ వర్మ ఏమి చెప్పాడంటే..

Ravanaura-raviteja
Ravanaura-raviteja
రవితేజ నటించిన మాస్‌ యాక్షన్‌ సినిమా రావణాసుర. పది తలల రావణాసురుడి ఆలోచనలు రవితేజ పాత్రలో వుంటాయి. ఈ సినిమా కథ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన విక్రమ్‌, పృధ్వీరాజ్‌ నటించిన రావణ్‌ ఛాయలు కనిపిస్తున్నాయని ట్రైలర్‌ చూస్తే తెలుస్తుందని దర్శకుడు సుధీర్‌ వర్మను అడిగితే, కాదు అంటూ ఆ సినిమా వేరు ఈ సినిమా వేరు అంటూ మణిరత్నం కథ రామాయణం కథ. ఈ రావణాసుర రామాయణంకు సంబంధంలేదని చెబుతున్నారు.
 
మరి బెంగాల్‌ భాషలోని ఓ సినిమాకు రీమేక్‌గా రావణాసుర తీశారని వార్తలు వస్తున్నాయని అడిగితే, ఆ సినిమా నేను చూడలేదు. చూస్తే మీకే తెలుస్తుంది. అలా చూడాలంటే ఏప్రిల్‌ 7వ తేదీ వరకు ఆగాల్సిందే అంటూ తెలియజేశారు. 8వ తేదీన ఈ సినిమాపై పూర్తి చర్చలో పాల్గొందామని తేల్చిపారేశారు. ఒకవేళ బెంగాల్‌ సినిమాకు రీమేక్‌ అయితే గనుక అప్పుడు ఏమి సమాధానం చెబుతాడో చూడాలి.