గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 1 ఏప్రియల్ 2023 (12:14 IST)

రావ‌ణాసుర నిర్మాతలకు సెన్సారు బోర్డు సూచన

Raviteja
Raviteja
ర‌వితేజ‌ నటిస్తున్న రావ‌ణాసుర సినిమా సెన్సారు కు వెళ్ళింది.  మధ్యలో ఐదు చోట్ల కటింగులు పడ్డాయని సమాచారం. మొత్తంగా ఈ సినిమా ర‌న్ టైమ్ 2 గంట‌ల 21 నిమిషాల 56 సెకండ్స్‌గా కుదించారు. సినిమాకు `ఏ` సర్టిఫికెట్ ఇచ్చారు. దీనిపై సెన్సారు వారు సూచనా చేశారట. ఇందులో హింస మోతాదు ఎక్కువగా ఉందని చెప్పారు. అయితే, కెజిఎఫ్. గురించి ప్రస్తావన రాగా, అది కేంద్ర సెన్సారు నుంచి తెచ్చుకున్నట్లుగా చెప్పినట్లు తెలిసింది. 
 
సినిమాలో వినోదం కు మించి  హింస ఎక్కువైంది. అందుకే తక్కువ ఉండేటట్లు చూడండని దర్శకుడిని, నిర్మాతకూ సెన్సారు సూచన చేసినట్లు తెలిసింది. రావ‌ణాసుర ఏప్రిల్ 7న ప్రేక్ష‌కుల‌ ముందుకు రానుంది. ఇందులో ర‌వితేజ  క్రిమిన‌ల్ లాయ‌ర్‌గా,  నెగెటివ్ షేడ్స్‌తో కూడిన మరో క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలిసింది. ఐదుగురు హీరోయిన్లు నటించిన ఈ సినిమాకు సుధీర్‌వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.