ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 25 మార్చి 2023 (16:07 IST)

రావణాసుర కోర్టు గది తగలపెట్టడానికి కారణం ఏమిటి?

Ravanasura new poster
Ravanasura new poster
రవితేజ- సుధీర్ వర్మల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రావణాసుర’ భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్‌కి సమయం ఆసన్నమైంది.
 
మైండ్ బ్లోయింగ్ పోస్టర్ ద్వారా రావణాసుర థియేట్రికల్ ట్రైలర్‌ను మార్చి 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఈరోజు అనౌన్స్ చేశారు. పోస్టర్‌లో రవితేజ ఫెరోషియస్ గా కనిపిస్తున్నారు. చేతులు పైకెత్తి ఒక చేతిలో తుపాకీతో ఇంటెన్స్ గా కనిపించారు. బ్యాక్ గ్రౌండ్ లో న్యాయ దేవత నీడ, కోర్టు గది తగలబడిపోవడం చూడవచ్చు. రావణాసురు ట్రైలర్‌లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో హైలీ ఇంటెన్స్  ఉంటుందనే అభిప్రాయాన్ని ఈ పోస్టర్ కలిగిస్తోంది.
 
ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా యూనిక్ కథను అందించారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్.
 ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా ప్రపంచ వ్యాప్తంగా రావణాసుర గ్రాండ్ రిలీజ్ కానుంది.