ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 23 మార్చి 2023 (11:17 IST)

ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతున్న రానా ఫస్ట్ లుక్, టీజర్

Rana move team
Rana move team
రవితేజ నున్నా, నేహా జూరేల్  జంటగా సత్య రాజ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ రామి శెట్టి సుబ్బారావు నిర్మించిన చిత్రం "రానా" (రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి) అనేది ట్యాగ్ లైన్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర యూనిట్ "రానా" ఫస్ట్ లుక్ & టీజర్ ను విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి నిర్మాత సి. కళ్యాణ్, దర్శకులు వీరు పొట్ల, నక్కిన త్రినాథ రావు, నిర్మాత ప్రసన్న కుమార్, స్వామి నాయుడు తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొని చిత్ర ఫస్ట్ లుక్ & టీజర్ ను విడుదల చేశారు.
 
అనంతరం సి. కళ్యాణ్ మాట్లాడుతూ..టీజర్  చాలా బాగుంది. డైరెక్టర్ చూయించిన విజువల్స్ లోనే కంటెంట్, క్రియేటివిటీ కనిపిస్తుంది.కాబట్టి మంచి కంటెంట్ తో వస్తున్న "రానా" సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు.
 
దర్శకులు వీరుపొట్ల మాట్లాడుతూ .దర్శకుడు సత్య రాజ్ లో మంచి ట్యాలెంట్ ఉంది. తన రైటింగ్ స్క్రిల్స్ కానీ ప్రెజెంటేషన్ కానీ చాలా చక్కగా వివరిస్తాడు. టైటిల్ తో పాటు టీజర్  లో చాలా క్యూరియాసిటీ ఉంది.మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా దర్శక, నిర్మాతలకు బిగ్ హిట్ అవ్వాలని అన్నారు.
 
దర్శకులు నక్కిన త్రినాధ్ రావ్ గారు  మాట్లాడుతూ టైటిల్ డిఫరెంట్ గా ఉంది. మంచి లవ్, & క్రైమ్ కథ తో వస్తున్న ఈ టైటిల్  యాప్ట్ అనిపించేలా  ఉంది. దర్శక, నిర్మాతలు ఈ సినిమా తర్వాత ఇలాంటి మంచి కంటెంట్ ఉండే  సినిమాలు ఎన్నో తియ్యాలి అన్నారు.
 
చిత్ర నిర్మాత రామి శెట్టి సుబ్బారావు మాట్లాడుతూ, దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను. అందరూ ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా సగటు ప్రేక్షకులందరికీ నచ్చేవిధంగా నచ్చుతుందనే నమ్మకం ఉందని అన్నారు.
 
చిత్ర దర్శకులు సత్యరాజ్ మాట్లాడుతూ.. ఇదొక విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ & క్రైమ్ స్టోరీ.ఈ కథలో  లవ్, ఎమోషన్, డ్రామా ఫన్ సస్పెన్సు ఇలా అన్ని కలగలపిన ఉగాది పచ్చడిలా ఈ సినిమా ఉంటుంది .నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. వీరందరి సపోర్ట్ చేయడం వలన సినిమా బాగా వచ్చింది.చూసిన వారందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.