మెగా పవర్ చిత్రం ప్రారంభం
Sri Kalyan, Shashi, Raghubabu
హీరో మాట్లాడుతూ హీరోగా తొలి చిత్రమిది. లైన్ బావుంది. కథ మీద బాగా వర్క్ చేశాం. నా మీద నమ్మకంతో మా బాబాయ్ నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ టీమ్ చేస్తున్నాం. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్తాం. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తాం అని అన్నారు. హీరోయిన్ శశి మాట్లాడుతూ తెలుగులో తొలి చిత్రమిది. హీరోయిన్ పరిచయానికి చక్కని కథ ఇది అన్నారు.
దర్శకుడు రవిచంద్ర మాట్లాడుతూ అల్లు అరవింద్‌గారి ఆశీస్సులతో సత్య ఆర్ట్స్ పతాకంపై తొలి చిత్రం ప్రారంభమైంది. మదర్ సెంటిమెంట్‌తో సాగే యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. యాక్షన్ సీన్స్ కోసం తగిన జాగ్రత్తలతో హీరో శిక్షణ పొందారు. త్వరలో ఒక్కో క్యారెక్టర్‌ను రివీల్ చేస్తాం. అవకాశం ఇచ్చిన నిర్మాతకు కృతజ్ఞతలు. అలాగే పండుగ బిజీలో ఉంది కూడా మా సినిమా ప్రారంభానికి వచ్చిన కిరణ్ అబ్బవరం, రఘుబాబు, పృథ్వీ గార్లకు థాంక్స్ అని అన్నారు.
