ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 16 మార్చి 2023 (19:41 IST)

రేపు ఢిల్లీ రానున్న రామ్‌చరణ్‌, మోదీతో భేటీ

Ramcharan wlcome poster
Ramcharan wlcome poster
మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ రేపు అనగా శుక్రవారం 17వ తేదీన ఇండియా రానున్నారు. ఇప్పటివరకు ఆస్కార్‌ అవార్డు వేడుకలలో బిజీగా వున్న చరణ్‌ రేపు ఉదయం 8.55ంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో టెర్నినల్‌3లో దిగనున్నారు. ఢిల్లీలో ఇండియా టుడే కాంక్లేవ్‌ ఈవెంట్‌కు హాజరుకానున్నారు. అనంతరం ఆయన ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఎ.ఆర్‌. రెహమాన్‌ కలిసి భేటీ కానున్నారు. ఇది ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇందులో ఎన్‌.టి.ఆర్‌. పాల్గొనడని తెలిసింది.
 
ఇప్పటికే ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమాతో రామ్‌ చరణ్‌కు గ్లోబల్‌ హీరోగా పేరు రావడంతో మరింత పాపులర్‌ అయ్యాడు. కాగా, ఆస్కార్‌ నామినేషన్‌ సందర్భంగా కొన్ని అపశ్రుతులు తలెత్తాయని ఇటీవలే ఎ.ఆర్‌. రెహమాన్‌ కూడా తెలియజేశారు. ఆస్కార్‌ నామినేషన్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సపోర్ట్‌ వుందని సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
ఇక రామ్‌ చరణ్‌కు హైదరాబాద్‌లో ఆల్‌ ఇండియా చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలకబోతున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆర్‌.ఆర్‌.ఆర్‌. టీమ్‌కు సత్కారం చేయబోతోన్నట్లు ఇప్పటికే ప్రకటించింది.