సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 డిశెంబరు 2022 (13:41 IST)

మా విమానం ఎక్కాలంటే 4 గంటలు ముందు రావాల్సిందే : ఇండిగో

delhi airport advisory
దేశంలో నడుస్తున్న ప్రైవేటు విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణికులకు ఓ హెచ్చరిక లాంటి సూచన చేసింది. తమ విమానాల్లో ప్రయాణం చేయదలచిన ప్రయాణికులు నాలుగు గంటలు ముందుగానే ఎయిర్‌‍పోర్టుకు రావాలని సూచింది. చెకిన్, బోర్డింగ్‌లకు అధిక సమయం పడుతుందని, అందువల్ల 3 గంటల 50 నిమిషాల కంటే ముందుగానే ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలని కోరింది. అలాగే, 7 కిలోలకు మించి బరువును తమ వెంట క్యారీ చేయొద్దని తెలిపింది. సెక్యూరిటీ తనిఖీలు సాఫీగా, పూర్తిగా చేసుకునేందుకు ప్రయాణికుడు లేదా ప్రయాణికురాలు తమ వెంట 7 కేజీలకు మించని బ్యాగ్‌తోనే రావాలని కోరింది.
passengers in airport
 
ఇదే అంశంపై ఢిల్లీ ఎయిర్‌పోర్టు అడ్వైజరీ పేరుతో ఓ ప్రకటన విడుదల చేసింది. "ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంది. దీంతో చెకిన్, బోర్డింగ్ సమయం అన్నది సాధారణ రోజులతో పోలిస్తే పడుతోంది" అని సూచన జారీచేసింది. సౌకర్యం కోసం వెబ్ చెకిన్ పూర్తి చేసుకోవాలని సూచించింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో గేట్ నంబరు 5, 6 ద్వారా టెర్మినల్ 3కి చేరుకుంటే దగ్గరగా ఉంటుందని తెలిపింది. కాగ, గత కొన్ని రోజులుగా ఢిల్లీ విమానాశ్రయంలో రద్దీ పెరగడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్న విషయం తెల్సిందే.