సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 అక్టోబరు 2022 (12:35 IST)

ట్రాలీని ఢీకొన్న బస్సు: 15మంది మృతి.. నలభై మందికి గాయాలు

road accident
ట్రాలీని బస్సు ఢీకొన్న ఘటనలో 15 మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలభై మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. రేవాలోని సుహాగి, పహారీ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అరటిపండ్లతో వెళ్తున్న ట్రాలీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ  ఘటనలో గాయపడిన వ్యక్తులను వెంటనే ప్రయాగ్‌రాజ్‌లోని ఆసుపత్రికి తరలించారు.
 
బస్సు హైదరాబాద్‌ నుంచి గోరఖ్‌పూర్‌కు వెళ్తోందని, ప్రయాణికులంతా ఉత్తరప్రదేశ్‌ వాసులేనని తెలుస్తోంది. వాలి పండుగ కోసం స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.