ఉన్నది ఉన్నట్లు మాట్లాడడమే తన నైజం విజయ్ దేవరకొండ
లైగర్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన విజయ్ దేవరకొండ ఆ సినిమా రిజల్ట్ ఎటువంటి ఫలితాన్ని ఇచ్చినా తను మాత్రం అందరికీ కావాల్సిన వాడయ్యాడు. తాజాగా అక్టోబర్ 24న జైజవాన్ దినోత్సం సందర్భంగా ప్రముఖ ఛానల్ ఆయన్ను ఇంటర్వ్యూ చేసింది. అందుకు బోర్డర్‌లోని సైనికులతో విన్యాసాలు, తుపాకీ ఫైరింగ్ నేర్పించి దేశానికి యూత్ ఎలా వుండాలో తెలియజేస్తూ వీడియో తీసింది.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ, తాను ఆ సమయానికి ఏది అనిపిస్తే అదే మాట్లాడతాను. లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడే తత్త్వం కాదు అంటూ ఖరాఖండిగా చెప్పేశాడు. పలు ప్రశ్నలకు సమాధానాలిస్తూ, వాషింగ్‌టన్ తన ఫేవరేట్ ప్లేస్. పాములంటే తనకు చాలా భయమని వెల్లడించాడు. తెలుగు ఇండస్ట్రీ చాలా ఎత్తుకు ఎదుగుతుంది. ఎంతోమంది హీరోలు, దర్శకులు, నిర్మాతల కృషిఫలంగానే ఇది సాధ్యమైందని వెల్లడించారు.