పాత సినిమాలు థియేటర్‌లోకి, కొత్త సినిమాలు ఓటీటీలోకి, స్పెషల్ స్టోరీ
సినిమారంగంలో చిత్రమైన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. కరోనాకు ముందు ఏ హీరో సినిమా అయినా కొద్దిరోజులు థియేటర్లలో ఆడేవి. అగ్ర హీరోలు కలెక్షన్లు, ఫ్యాన్స్ మధ్య పోటీ వుండేది. కరోనా వల్ల పూర్తిగా మారిపోయింది. ఏడాదిన్నరపాటు థియేటర్‌కు ప్రేక్షకుడు దూరం కావడంతో అప్పట్లో పెద్ద, చిన్నా తేడా లేకుండా ఓటీటీ అనే కొత్త ప్రకియ రావడంతో అందరూ అందుకు అలవాటుపడిపోయారు. సినిమాలు తీసేవారు కూడా ఓటీటీ మార్కెట్‌ను దృష్టిలోపెట్టుకుని లెక్కలు వేసుకునేవారు.
ఇదిలా వుండగా, ఒకప్పుడు ఏదైనా సినిమా పేరున్న హీరో చిత్రం విడుదల చేయాలంటే నిర్మాతనో పంపిణీదారుడినో అడిగి కొంతమంది సమాజ సేవ పేరుతో రెండు షోలు వేసి పుణ్యం పురుషార్థం చూసుకునేవారు. అది కొంతకాలం సాగడంతో ఇదేదో మనమే రిలీజ్ చేస్తే బాగుంటుందని నిర్మాతలు నిర్ణయానికి వచ్చేశారు. దాంతో ఆ ప్రక్రియకు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మరలా అదే ప్రక్రియ రావడంతో, రిరీలీజ్ పేరుతో టీవీల్లోనూ, థియేటర్లలోనూ చూసిన సినిమానే మరలా రీ రిలీజ్ చేయడం విశేషం.
ఈసారి ఏకంగా హీరోలే దాన్ని భుజాన వేసుకుని తమ సినిమాలను విడుదలచేస్తూ, ఆ వచ్చిన సొమ్ముతో సమాజ సేవ చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. మహేస్‌బాబు పోకిరి, పవన్ కళ్యాణ్, డబ్బింగ్ సినిమా విజయ్ కొలవెరి నుంచి రేపోమాపో విడుదలకాబోతున్న ప్రభాస్ భిల్లావరకు రీ-రిలీజ్‌లు వచ్చేశాయి. అందుకు ముందుగా బుకింగ్‌లు ఓపెన్ చేయడం హాట్ కేక్‌లా అమ్ముడుపోవడం జరుగుతోంది. ఇందుకు టార్గెట్ యూత్ ప్రేక్షకులే.
ఇలా కాలంతోపాటు మారుతున్న సినిమా చరిత్ర పాత సినిమాలు సేవ పేరుతో రిలీజ్‌లు చేస్తుంటే కొత్త సినిమాలు థియేటర్‌కు చాలా మాటుకు నోచుకోక కొద్దిరోజులు ఆడి ఓటీటీలోకి వెళ్లడం చిత్రంగానూ మారింది. చిత్రమైన తీరున్న ఈ సినిమారంగాన్ని పదిలంగా కాపాడుకోవాలంటే కథకులు, దర్శకులు, నిర్మాతలు సరైన కథలపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా వుంది.