గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 15 అక్టోబరు 2022 (19:43 IST)

జ‌వాన్‌ల‌తో ఫైరింగ్ నేర్చుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Vijay Devarakonda firing
Vijay Devarakonda firing
విజ‌య్ దేవ‌ర‌కొండ తాజాగా జ‌వాన్‌ల‌తో గ‌డిపారు. దీనికి సంబంధించిన ఫొటోల‌ను త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాజా స‌మాచారం మేర‌కు జై జ‌వాన్ కార్య‌క్ర‌మంలో భాగంగా  విజ‌య్ దేవ‌ర‌కొండ దేశ స‌రిహ‌ద్దులో డ్యూటీ చేస్తున్న వారిని క‌ల‌వాల్సి వ‌చ్చింది. ఎన్‌డిటివి ఛాన‌ల్ ప్ర‌త్యేకంగా  విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై జైవాన్ కార్య‌క్ర‌మం చేపట్టింది. ఈ సంద‌ర్భంగా విజ‌య్ క‌లిసిన‌ట్లు తెలుస్తోంది. అది త్వ‌ర‌లో టెలికాస్ట్ కాబోతుంది. 
 
Vijay Devarakonda firing
Vijay Devarakonda firing
ఈ సంద‌ర్భంగా అక్క‌డి జ‌వాన్‌ల‌ను క‌లిసి వారి విధి విధానాలు, డ్యూటీలో వున్న సాధ‌క‌బాధ‌ల‌ను తెలుసుకున్నారు. ముఖ్యంగా ఫైరింగ్ ఎలా చేయాలో వారి నుంచి నేర్చుకున్నారు. అక్క‌డి జ‌వాన్‌లంతా  విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను అభినందించ‌డం విశేషం. అసలు ఎందుకు విజ‌య్‌ను ఎంపిక చేసింది. ఆ వివ‌రాలు ఆ ఛాన‌ల్ త్వ‌ర‌లో తెలియ‌జేయ‌నుంది.
 
విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్‌తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆ త‌ర్వాత మిల‌ట్రీ నేప‌థ్యంలో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు కూడా ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ తెలియ‌జేశాడు. అయితే కొన్ని అనివార్య కార‌ణాల‌వ‌ల్ల ఈసినిమా అట‌కెక్కింది. కానీ, ఖుషి అనే సినిమా చేయ‌డం ఖ‌రారైంది. త్వ‌ర‌లో అది సెట్‌పైకి వెళ్ళ‌నుంది.