ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 సెప్టెంబరు 2022 (11:09 IST)

లైగర్‌పై ఆర్జీవీ సెన్సేషనల్ కామెంట్స్.. కరణ్ జోహారే కారణం..

liger movie
లైగర్ సినిమాపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో లైగర్ సినిమా గురించి మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో బాయ్‌కాట్‌ లైగర్‌ అనడానికి మెయిన్ కారణం కరణ్‌ జోహర్‌. అతనికి ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉండడం వల్ల బాలీవుడ్‌ ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించలేదు. 
 
సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత బాలీవుడ్‌ ప్రజలు కరణ్‌ సినిమాలను బాయ్ కాట్ చేయడం మామూలైపోయింది. అయితే ఇదొక్కటే లైగర్ పరాజయానికి కారణం మాత్రం కాదు.
 
మరొక కారణం వినయం. హిందీ ప్రేక్షకులు ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, ప్రభాస్‌ల మంచితనం, స్టేజిమీద, నలుగురిలో పద్దతిగా, వినయంగా ఉండటం చూసి చాలా ఇష్టపడ్డారు. 
 
బాలీవుడ్‌లో అలా ఉండేవాళ్లు చాలా తక్కువ మంది. కానీ విజయ్‌ మామూలుగానే స్టేజీపై దూకుడుగా ఉంటాడు. అందరినీ ఆకర్షించాలని రకరకాల చేష్టలు చేస్తాడు, లైగర్‌ ఈవెంట్‌లలో, ప్రమోషన్స్‌లో విజయ్‌ మరీ ఓవర్‌గా మాట్లాడటం కూడా ఈ సినిమాకి మైనస్ అయింది" అని ఆర్జీవీ అన్నారు.