శుక్రవారం, 9 జూన్ 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated: శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (20:11 IST)

మహేష్ బాబుతో నటించనున్న అలియా భట్! (video)

Alia Bhatt
బ్రహ్మాస్త్ర మూవీ సూపర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది బాలీవుడ్ నటి అలియా భట్. భర్త రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి నటించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర రికార్డులు సృష్టిస్తుండటంతో ఆమె ఫుల్ హ్యాపీగా ఉంది. ఇప్పుడామె టాలీవుడ్‌లో మరో సినిమా చేయబోతోంది. 
 
అది కూడా తనకు ఆర్‌ఆర్‌ఆర్‌లాంటి సూపర్‌ హిట్‌ అందించిన రాజమౌళితోనే అంటూ వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ వార్తలు నిజమేనని ఫిల్మి క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమేర్ సంధు ఓ ట్వీట్ చేశాడు. 
 
"మహేష్‌ బాబుతో రాజమౌళి తీస్తున్న మూవీలో నటించడానికి అలియా భట్‌ అంగీకరించింది. ఎస్‌ఎస్‌ఎంబీ29 షూటింగ్‌ అలియా ప్రసవించిన తర్వాత ప్రారంభమవుతుంది" అని ఉమేర్‌ ట్వీట్‌ చేయడం విశేషం. ఈ ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది.  
 
ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో రామ్‌చరణ్‌కు జోడీగా ఆమె సీతగా కనిపించిన విషయం తెలిసిందే. అలియా భట్‌ ప్రస్తుతం ప్రెగ్నెంట్‌ అనే సంగతి తెలిసిందే. గర్భవతిగా ఉంటూ ఆమె తన లేటెస్ట్‌ మూవీ బ్రహ్మాస్త్ర కోసం తన భర్త, ఆ మూవీ హీరో రణ్‌బీర్‌తో కలిసి ప్రమోషన్లలో పాల్గొంది. 
 
ఇక ఇటు మహేష్‌ బాబు ప్రస్తుతం తన నెక్ట్స్‌ మూవీ ఎస్‌ఎస్‌ఎంబీ28 పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీని త్రివిక్రమ్‌తో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తర్వాత అతడు రాజమౌళితో సినిమాను మొదలుపెట్టనున్నాడు. ఈ చిత్రంలో అలియా భట్ ప్రిన్స్ సరసన నటించనుంది.