అలియా భట్, రణబీర్ కపూర్‌ల ప్రేమను బ్రహ్మాస్త్ర3డిలో చూడాల్సిందే - రివ్యూ రిపోర్ట్
గత నాలుగేళ్ళుగా బాలీవుడ్ పాన్ ఇండియా సినిమాగా రూపొందిన చిత్రం `బ్రహ్మాస్త్ర`. దీనిని తెలుగులో కూడా డబ్ వర్షన్‌లో రిలీజ్ అయింది. చిరంజీవి వాయిస్ ఓవర్‌తో కథ చెప్పించాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. సెప్టెంబర్ 9నే ఈ సినిమా తెలుగులోనూ విడుదలయింది. 3డి వర్షన్‌లో విడుదలైన ఈ సినిమా గురించి సినీ విశ్లేషకులు అంచనా ఇలా వుంది.
- పూర్వకాలంలో గ్రంథాల్లో వున్న బ్రహ్మాస్త్ర గురించి తీయాలని తీసిన సినిమా ఇది. ఎవెంజర్స్, మార్‌వెల్స్ బేస్‌చేసుకుని ఈ సినిమా తీశారని చెప్పవచ్చు. అందుకే గ్రాఫిక్స్ ఎక్కువగా పెట్టడం వల్ల ఓవర్ అయిపోయి చూసేవాడికి విసుగు పుట్టిస్తుంది. అసలు అన్ని గ్రాఫిక్స్ అవసరంలేదు కూడా అని అనిపిస్తుంది.
- ఇక భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను తెలుగులో సమర్పకునిగా ఎస్.ఎస్. రాజమౌళి వ్యవహరించారు. ఆయన ప్రమోషన్ చేశారు. కానీ అది మొదటిరోజు థియేటర్‌వరకే పరిమితం అని తేలింది.
- సినీ ట్రేడ్‌వర్గాలు, విశ్లేషకులు ఇలా తెలియజేస్తున్నారు.
కథగా చెప్పాలంటే.. పుట్టుకతోనే అగ్ని అస్త్రం రణబీర్ కపూర్‌కు కవచంలా వుంటుంది. అగ్ని అతన్ని ఏమీచేయలేదు. పెద్దయ్యాక రణబీర్ కపూర్‌కు కలలు వస్తుంటాయి. అవి ముందు జరగోయేవి తెలిసిపోతుంటాయి. అలా కొందరు దుండగులు (సైతాన్‌లు) సైంటిస్ట్ షారూఖ్‌ఖాన్‌ను, అగ్ని అస్త్రంతో సంబంధం వున్న అమితాబ్‌ను చంపాలను చూస్తారు. అది తెలిసి వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు రణబీర్. ఫైనల్‌గా హిమాలయాల్లో వున్న అమితాబ్‌ను కలవడంతో తన పుట్టుకు అర్థం, తన కలలు రావడానికి కారణం ఏమిటి? అనేది అమితాబ్ పాత్ర ద్వారా రణబీర్‌కు తెలుస్తుంది. ఆ తర్వాత జరిగిన పరిణమాలే మిగిలిన సినిమా.
విశ్లేషణ
- బ్రహ్మాస్త్ర సినిమాను మూడు పార్ట్‌లుగా తీయాల్సిన అవసరంలేదు. అసలు మొదటి పార్ట్‌కే జనాలకు విసుగుపుట్టింది. రణబీర్ కపూర్. అలియాభట్ కెమిస్ట్రీ బాగా పండింది. కేవలం వారి ప్రేమకోసమే ఈ సినిమా తీశారా! అని కొన్ని సార్లు అనిపిస్తుంది.
- ఇండియాన్ మూవీస్‌లో ఎపిక్స్ చాలా వున్నాయి. రాజమౌళి తీసిన బాహుబలి.. ఆర్.ఆర్.ఆర్. లలో ఎమోషన్స్ పండించాడు. రీసెంట్‌లో బింబిసారాలోకూడా అదే చేశారు. అదేవిధంగా సీతారామం, కార్తికేయ2లోనూ ఫిక్షన్ అయినా ఎమోషన్స్ ప్రతివాడు కనెక్ట్ అయ్యేలా చేయగలిగారు. హిట్ కొట్టారు. కానీ బ్రహ్మాస్త్రలో అదే లోపం.
- ్రబహ్మాస్త్రంఅనే టాపిక్ తీసుకున్నప్పుడు దాన్ని ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా వెండితెరపై చెప్పాలంటే కథను సరిగ్గా రాసుకోవాలి. గ్రాఫిక్స్ కూడా కథ బాగుంటేనే ఉపయోగపడతాయి. గ్రాఫిక్స్ హైలైట్ చేసేసరికి అసలు కథ మరుగపడింది. కేవలం చిరంజీవి వాయిస్ ఓవర్‌తో కథ చాలాసేపు చెప్పడంతో చూసే ప్రేక్షకుడికి కిక్ పోయింది.
- షారూఖ్‌ఖాన్ చాలా కాలం తర్వాత తెరపై చూశాం. ఆయన ఎమోషన్స్ బాగా చూపించాడు. ఇక అమితాబ్ గురించి చెప్పాలంటే పాత్రపంగా బాగా చేశాడు.
- కానీ సినిమాచరిత్రలో సినిమా బాగుండాలంటే కథను మించిన అస్త్రంలేదు. ఇది ఇండియన్ సినిమా లవర్స్కూ తెలిసిందే. దానికి అనుగుణంగా ఎమోషన్స్ క్యారే చేయాలి. అది రచయిత, దర్శకుడి బాధ్యత. అది బ్రహ్మాస్త్రలో లోపించింది. డబ్బులు పెట్టి కొని చూసే ప్రేక్షకుడు బయటకు రాగానే హ్యాపీగా రావాలి. కానీ బ్రహ్మాస్త్ర గందరగోళంగా వుండడంతో అన్‌హ్యాపీగా బయటకు వస్తాడు. మరి దీనికి సీక్వెల్స్ ఉంటాయో లేదో చూడాలి.