సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 3 సెప్టెంబరు 2022 (16:38 IST)

బ్రహ్మాస్త్ర ప్రెస్ మీట్లో తెలుగులో మాట్లాడిన రణబీర్ కపూర్, ముగ్ధురాలైన ఆలియాభట్

Alia Bhatt-Ranbir Kapoor
రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor), ఆలియా భట్(Alia Bhatt) జంటగా తెరకెక్కిన చిత్రం బ్రహ్మాస్త్ర(Brahmastra). ఈ చిత్రం ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపధ్యంలో శుక్రవారం నాడు ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్ర బృందం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఈ సమావేశంలో రణబీర్ కపూర్ తెలుగులో మాట్లాడి ఆశ్చర్యపరిచాడు.

 
Brahmastra press meet
రణబీర్ మాట్లాడుతూ... "నా కెరీర్లో బిగ్గెస్ట్ ఫిల్మ్ బ్రహ్మాస్త్ర. బిగ్గెస్ట్ ఈవెంట్ కూడా ఇదే. మంచి చిత్రాన్ని ఎప్పుడూ ప్రోత్సహించే తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మా చిత్రం అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన అక్కినేని, నందమూరి, రాజమౌళి అభిమానులందరికీ థాంక్యూ. బ్రహ్మాస్త్ర పార్ట్ 2 సమయానికి తెలుగు ఇంకా బాగా నేర్చుకుంటా. నేను ఏదయినా తప్పు మాట్లాడితే మన్నించండి'' అంటూ రణబీర్ తెలుగు మాట్లాడారు.

 
తన భర్త తెలుగులో మాట్లాడటం చూసి అలియా భట్ ముగ్ధురాలైంది. రాజమౌళి నేరుగా వెళ్లి ఆలింగనం చేసుకుని తెలుగులో అద్భుతంగా మాట్లాడావని అన్నారు. అలియాభట్ ఆర్ఆర్ఆర్ చిత్రంలోని కుంకుమలా అనే పాటను పాడి అలరించారు.