1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 26 ఆగస్టు 2022 (14:04 IST)

నాగార్జున‌, రాజ‌మౌళి, ర‌ణ‌బీర్ క‌పూర్ లంచ్ ప్ర‌మోష‌న్‌

Nagarjuna, Rajamouli, Ranbir Kapoor
Nagarjuna, Rajamouli, Ranbir Kapoor
కాదేదీ క‌విత‌కు అన‌ర్హం అంటూ అప్ప‌ట్లోనే ఓ క‌వి అన్నారు. ఇప్పుడు సినిమా ద‌ర్శ‌కులు, హీరోలు కూడా త‌మ సినిమా ప్ర‌మోష‌న్ కోసం ర‌క‌ర‌కాలుగా వినియోగించుకుంటున్నారు. అన్న న‌డిస్తే, మాస్‌. కూర్చింటే మాస్‌.. అంటూ నాగార్జున గ‌తంలో ఓ సినిమాలో డైలాగ్‌లు చెప్పాడు. ఇప్పుడు కూడా అలానే చేస్తున్నాడు. ఇటీవ‌లే చెన్నైలో బ్ర‌హ్మాస్త్ర సినిమా ప్ర‌మోష‌న్‌కు వ‌చ్చారు. అక్క‌డ ఓ సామాన హోట‌ల్‌లో లంచ్ చేశారు.
 
నాగార్జున‌, రాజ‌మౌళి, ర‌ణ‌బీర్ క‌పూర్ క‌లిసి అరిటాకులో అక్క‌డ టేబ్‌పై కూర్చుని భోజ‌నం చేశారు. అందులో వంట‌కాలు ఏమై వుంటాయ‌ని నెటిజ‌న్లు, అభిమానులు తెగ వెతికారు. ఇప్పుడు అందులో వున్న ఐటెం ఏమిటి? అని ఆరాతీస్తే! పాప‌డ్‌, ట‌మోటా చెట్లీ, ఓ వేపుడు, బూందీ, మిక్స‌ర్‌, బెల్లం అన్నం వున్నాయి. సాదాసీదా హోట‌ల్‌లో ఇలా తిన‌డంకూడా ప‌బ్లిసిటీగా చిత్ర యూనిట్ తెలియ‌జేస్తోంది. 
 
బ్ర‌హ్మాస్త్ర రెండు భాగాలుగా తీస్తున్నారు. మొద‌టి భాగం సెప్టెంబ‌ర్‌9న విడుద‌ల కాబోతోంది. నాగార్జున ముఖ్య పాత్ర పోషించారు. రాజ‌మౌళి తెలుగులో ఈ సినిమాను స‌మ‌ర్పిస్తున్నారు. అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో మైథ‌లాజిక‌ల్ చిత్రంగా రూపొందుతోంది.