రామ్‌చరణ్ సినిమా ఆగిపోతుందా!
తమిళ దర్శకుడు శంకర్, రామ్ చరణ్ సినిమా ఆర్.సి.15 సినిమా షూటింగ్ జరుపుకుంది. కొంతకాలం చేశాక గేప్ వచ్చింది. తాజాగా ఇప్పుడు శంకర్ `ఇండియన్2` సినిమాను చేస్తున్నట్లు సెప్టెంబర్‌లో షూట్ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. అయితే రామ్‌చరణ్ సినిమా కాస్త బ్రేక్ ఇస్తాడా. అనేది డౌట్ అభిమానుల్లో నెలకొంది. కానీ ఆర్.సి.15 దాదాపు మూడువంతుల పార్ట్ పూర్తయినట్లు తెలుస్తోంది.
మరి చరణ్ సినిమా ఏమవుతుంది? అనే విషయం చాలా వైరల్ అయింది. దీనితో శంకర్ లేటెస్ట్‌గా ఓ పోస్ట్ పెట్టాడు. దానితో అందరూ హమ్మయ్య అనుకున్నారు. విషయం ఏమంటే అందరిలోనూ వున్న అనుమానం తీర్చడానికి తాను పెట్టినట్లు తెలుస్తోంది. కమల్‌హాసన్ సినిమా, చరణ్ సినిమా రెండు కూడా ఒకేసారి చేయబోతున్నట్లు ఆ పోస్ట్ సారాంశం. కనుక తెలుగు సినిమారంగంలో వస్తున్న అనుమానాన్ని ఆయన సాల్వ్ చేసినట్లుంది.