శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 24 ఆగస్టు 2022 (10:40 IST)

ఇండియ‌న్‌2 లేటెస్ట్ షూట్ పునఃప్రారంభం

Kamal poser
Kamal poser
భార‌తీయుడు సినిమా క‌మ‌ల్‌హాస‌న్ చ‌రిత్ర‌లో మైలురాయి. చాలా కాలం త‌ర్వాత సీక్వెల్‌గా ద‌ర్శ‌కుడు శంక‌ర్ చేస్తున్న ఈ సినిమాకు ఇండియ‌న్‌2 అని పేరు పెట్టారు. త‌మిళ సినిమా చిత్రీక‌ర‌ణ కొద్దికాలం క్రితం ఆరంభ‌మైంది. క‌రోనా త‌ర్వాత కొన్ని కార‌ణాల త‌ర్వాత బ్రేక్ ప‌డింది. ఆ త‌ర్వాత క‌మ‌ల్ న‌టించిన `విక్ర‌మ్‌` ఇచ్చిన విజ‌యంతో ఇండియ‌న్‌2ను ఈరోజు పునఃప్రారంభించారు. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ నేడు తెలియ‌జేసింది.
 
వైట్ డ్రెస్‌తో వున్న క‌మ‌ల్‌హాస‌న్ ఫొటోను పోస్ట్ చేస్తూ... ఇండియ‌న్‌.. హి ఈజ్ బ్యాక్ అంటూ పోస్ట‌ర్‌లో తెలిపింది. ఈ చిత్రానికి ఇప్పుడు లైకా ప్రొడక్షన్స్, ప్రముఖ సంస్థ రెడ్ జయింట్  భాగం అయ్యినట్టు పోస్ట‌ర్‌లో తెలియ‌జేస్తూ ట్వీట్ చేశారు. తాను సెప్టెంబర్ నుంచే షూటింగ్ లో పాల్గొననున్నట్టు క‌మ‌ల్ తెలిపి మరో అప్డేట్ అందించారు. ఇక ఈ భారీ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. నేటినుంచి పునః ప్రారంభ‌మ‌యింది.