గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 జులై 2022 (13:44 IST)

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో కమల్ హాసన్ "విక్రమ్" స్ట్రీమింగ్

vikram
విశ్వనటుడు కమల్ హాసన్, యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "విక్రమ్" చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. జూన్ మూడో తేదీన ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా విడుదలైన కలెక్షన్ల వర్షం కురిపించింది. 
 
ఈ చిత్రం జూలై 8వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. దీనిపై మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని రాజ్‌కమల్ ఫిల్మ్స్ పతాకంపై కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్‌లు కలిసి తెరకెక్కించారు. 
 
ఇందులో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్యలు కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం తమిళంలో ఇప్పటివరకు ఉన్న బాహుబలి రికార్డును సైతం బ్రేక్ చేసి, అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. పైగా, ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్ల మేరకు కలెక్షన్లు రాబట్టినట్టు తెలుస్తోంది.