సోమవారం, 15 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఆత్మకూరు బైపోల్ : గెలుపు దిశగా వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి

vikram reddy
నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమై, ప్రశాంతంగా కొనసాగుతోంది. వైకాపా తరపున ఉప ఎన్నిక బరిలో నిలిచిన దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌ రెడ్డి పూర్తి ఆధిక్యంలో కొనసాగుతూ గెలుపు దిశగా వెళ్తున్నారు. 
 
12 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే సరికి మేకపాటి విక్రమ్‌ రెడ్డి.. 50 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో 2.13 లక్షల మంది ఓటర్లు ఉండగా, 1.37 లక్షల మంది ఉప ఎన్నిక పోలింగ్‌లో ఓట్లు వేశారు. 
 
12వ రౌండ్ (12 రౌండ్లు కలిపి) పూర్తయ్యేసరికి మేకపాటి విక్రమ్ రెడ్డికి 61,829, భాజపా అభ్యర్థి భరత్ కుమార్‌కు 11,175, బీఎస్పీ అభ్యర్థి ఓబులేసుకు 3,405, నోటాకు 2,598 ఓట్లు వచ్చాయి. మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప భాజపా అభ్యర్థి భరత్ కుమార్‌పై 50,654 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.