1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2022 (07:41 IST)

ఆత్మకూరు ఉపఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్

polling
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి గురువారం జరిగిన ఉప ఎన్నిక పోలింగ్‌లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో హఠాన్మరణం చెందిన మాజీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి అధికార వైకాపా తరపున పోటీ చేశారు. తమ పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఉప ఎన్నిక బరిలో దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించుకుంది. అయినప్పటికీ ఇక్కడ మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 
 
ఈ ఉప ఎన్నికల ఓటింగ్‌లో భాగంగా, గురువారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ మొదలుకాగా, సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగింది. సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్ కేంద్రాల్లో నిలిచిన వారందరికీ అధికారులు ఓటు హక్కును కల్పించారు. అయితే, సాయంత్రం 5 గంటలకు 61.70 శాతం మేరకు పోలింగ్ నమోదు కాగా, పోలింగ్ పూర్తయ్యే సమయానికి ఇది 70 శాతానికి పైగా చేరింది. దీంతో ఆత్మకూరు చరిత్రలో అత్యధిక పోలింగ్ నమోదైంది.