1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 మే 2022 (16:53 IST)

దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న రాజ్యసభ ఖాళీ స్థానాలకు ఎన్నికలు

rajyasabha
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం వెల్లడించింది. దేశంలో 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానాలకు వచ్చే నెల 10వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 
 
అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. నామినేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ మే 31వ తేదీన చివరి తేదీగా నిర్ణయించారు. అలాగే, స్క్రూటినీ జూన్ 1వ తేదీన జరుగుతుంది. 
 
నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 3 చివరి తేదీ కాగా జూన్ 10న ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. 
 
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో సురేశ్ ప్రభు, వైఎస్ చౌదరి, వి.విజయసాయి రెడ్డి, టీజీ వెంకటేష్‌ల పదవీకాలం జూన్‌ 21తో ముగియనున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో కెప్టెన్ వీ లక్ష్మీకాంతరావు, డీ శ్రీనివాస్‌ల పదవీకాలం పూర్తవుతుంది. ఈ స్థానాలకు జూన్ పదో తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు.