మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 మే 2022 (11:34 IST)

కేసీఆర్ సర్కార్ మరో గుడ్ న్యూస్: 70 ఏఈ పోస్టులు

telangana state
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్‌ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ భర్తీ కానుంది. మొత్తం 70 ఏఈ పోస్టులు ఉన్నాయి. 
 
ఈ పోస్టులకు ఈనెల 12వ తేదీ నుంచి జూన్‌ 3వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్ లైన్‌లో స్వీకరించనున్నట్టు అధికారులు తెలిపారు. 
 
రాత పరీక్ష జూలై 17వ తేదీన నిర్వహిస్తామని, బీటెక్ చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులని అధికారులు పేర్కొన్నారు. 
 
మరోవైపు పోలీస్ శాఖలో, గ్రూప్ 1 పోస్టులకు ఇటీవలే ఉద్యోగ ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే.