Mahesh Babu: రాజమౌళికి ఓకే అనిపించడం అంత ఈజీ కాదు : మహేష్ బాబు
Rajamouli at Varanasi interview
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్ లో దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న సినిమా వారణాసి. వచ్చే ఏడాది విడుదల చేయనున్న ఈ సినిమా గురించి ఒక పక్క షూటింగ్ కొనసాగిస్తూనే తన ప్రణాళికను బట్టి రాజమౌళి తోపాటు తన టీమ్ ను ప్రమోషన్ ద్వారా వెల్లడిస్తున్నారు. విదేశీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా ఒక పార్ట్ వుంటుంది. రెండు భాగాలుండదు. బాగా ఆలోచించి కథను బ్రీఫ్ గా చెప్పి ముగించేశాని వెల్లడించారు. మరోవైపు సోషల్ మీడియాలో నటీనటులతో మరో ఇంటర్వ్యూ ఇచ్చిన విషయాన్ని తెలియజేస్తూ కొన్ని విషయాలు అభిమానులకు వెల్లడిస్తున్నారు.
సహజంగా రాజమౌళి ఒకే షాట్ ను ఓకే అయినా మరో కోణంలో సరిపోలేదని పలు సార్లు తీసిన సందర్భాలను గతంలో ఆర్.ఆర్.ఆర్. షూటింగ్ ప్రమోషన్ లో ఎన్.టి.ఆర్. పూసగుచ్చినట్లు చెపర్పారు. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతోంది. రాజమౌళి తో సినిమా చేయడం అంటే చాలా కష్టమైనపని. అంత ఈజీకాదని ఇతర నటీనటులు అనుభవం ద్వారా తెలుసుకున్నానని మహేష్ బాబు అన్నారు. కొలైడర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారు పలు విషయాలు తెలిపారు. వారణాసి కథను మొదట విన్నప్పుడు నిజంగా భయపడ్డా. కథ పరిధి, పాత్రలో ఉన్న లోతు చూసి ఇది సాధారణ పాత్ర కాదని అర్థమైంది. ఈ పాత్ర కోసం తన నడక, నిలువు భంగిమ, శరీర భాష మొత్తం మార్చుకున్నానని మహేష్ బాబు చెప్పారు.
అంతేకాక ఒకే షాట్ కోసం ఆరు నెలల శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు. కలరీపయట్టు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొంది, రాముడి భంగిమను పర్ఫెక్ట్‌గా తీసుకురావడానికి ఏడాది కాలం ప్రిపరేషన్ చేశానని తెలిపారు. రాజమౌళికి ఓకే అనిపించడం అంత ఈజీ కాదని నటీనటులందరూ ఏకగ్రీవంగా చెప్పారు. కొన్ని సన్నివేశాలకు వందకు దగ్గరగా టేక్‌లు తీసిన సందర్భాలున్నాయట. ప్రతి ఫ్రేమ్‌కు సగటున 20 గంటల పాటు రెండరింగ్ జరిగిందని వెల్లడించారు.
అంతేకాక, వారణాసి టీజర్ AIతో తయారైంది అనేది అబద్ధమని రాజమౌళి తెలిపారు.“ఇది AI అనడం ఆ టీమ్ చేసిన కష్టానికి అవమానం. ప్రతి ఫ్రేమ్ వెనుక అపారమైన కళాత్మక శ్రమ ఉంది” అని స్పష్టంగా చెప్పారు.
పృథ్వీరాజ్ పాత్రలో వీల్‌చైర్ ఒక ఆయుధం అలాంటిదని పేర్కొన్నారు. అదేవిధంగా వారణాసిలో మరో నాటు నాటు లాంటి సాంగ్ కూడా వుండవచ్చనేది కూడా సూచాయిగా తెలిపారు. కథ కాలానికి సంబంధించినది కాబట్టి అంటార్కిటికా, ఆఫ్రికా, భారతదేశంలోని వారణాసి వరకు సాగుతుంది. ఇప్పటికే ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.