మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

తెలంగాణాలో ఎనిమిది జిల్లాలకు భారీ వర్ష సూచన

daimond rain
తెలంగాణా రాష్ట్రంలో ఎనిమిది జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ముఖ్యంగా, ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, పాలమూరు, ములుగు, జయశంకర్ భూపాలపల్లి మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 
 
వర్షం పడే సమయంలో గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపారు. రాష్ట్రంలో రేపు కూడా అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇదిలావుంటే, వనపర్తి జిల్లాలో వడదెబ్బ కారణంగా ఒకరు, కుమరం భీమ్ జిల్లా కాగజ్ నగరులో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.