మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్

వలస గిరిజన మహిళపై అత్యాచారం.. చంపి శవాన్ని కూడా రేప్ చేశాడు..

rape victim
తెలంగాణ రాష్ట్రంలో దారుణం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తుఫ్రాన్ పేట శివారులో బతుకుదెరుపు కోసం వచ్చిన ఓ వలస మహిళపై ఓ కిరాతకుడు దాడి చేశారు. ఆ గిరిజన మహిళను చెరబట్టి అత్యాచారం చేశాడు. విచాక్షణారహితంగా దాడి చేసి అత్యాచారం చేశాడు. ఆ మహిళ చనిపోయిన తర్వాత కూడా శవాన్ని సైతం వదిలిపెట్టలేదు. శవాన్ని కూడా అత్యాచారం చేశాడు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని 12 గంటల్లోనే పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండలంలోని ఓ తండాకు చెందిన భార్యాభర్తలు బతుకుదెరువు కోసం రెండు నెలల క్రితం యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చారు. ఆరేళ్ల క్రితం వీరికి వివాహం కాగా, పిల్లలు లేరు. చౌటుప్పల్‌ మండలం తూప్రాన్‌పేట శివారులోని మూతబడిన ఓ కన్‌స్ట్రక్షన్‌ గోదాంకు భార్య(28), భర్తలు వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. అక్కడే ఒక గదిలో నివాసం ఉంటున్నారు. 
 
జీతం చాలకపోవడంతో పరిశ్రమ సమీపంలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో భర్త సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా, భార్య గోదాం వద్దే ఉంటోంది. రోజులాగే భర్త సోమవారం విధులకు వెళ్లాడు. డ్యూటీ ముగించుకుని రాత్రి 8 గంటలకు వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. భార్య కోసం చుట్టుపక్కల వెతుకుతుండగా బాత్‌రూమ్‌ సమీపంలోని గడ్డివాము దగ్గర విగతజీవిగా రక్తపు మడుగులో అర్ధ నగ్నంగా పడి ఉంది. 
 
భర్త వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌లను రప్పించి, వివరాలు సేకరించారు. మృతదేహాన్ని మంగళవారం ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఆమెపై రెండుసార్లు లైంగికదాడి చేసినట్లు నిర్ధారించారు. 
 
ఒంటరిగా ఉండడంతో అఘాయిత్యం గోదాముకు సమీపంలోని సిమెంట్‌ బ్రిక్స్‌ పరిశ్రమలో పనిచేసే కార్మికుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు బాధితురాలు ఒంటరిగా ఉండడంతోనే నిందితుడు దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 
 
సోమవారం సాయంత్రం మహిళ ఉంటున్న గోదాము వద్దకు వెళ్లి ఆమెపై లైంగిక దాడికి యత్నించడంతో ఆమె తప్పించుకునే యత్నం చేసి ఉంటుందని, అక్కడి నుంచి పట్టుకొని గడ్డివాము సమీపంలోకి లాక్కొచ్చి లైంగిక దాడి చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
లైంగికదాడి అనంతరం బాధితురాలు పరుగెత్తుతుండగా కర్రతో తలపై బలంగా మోది ఉంటాడని, ఆమె పడిపోగా ముఖం, తలపై విచక్షణారహితంగా కొట్టడంతో ప్రాణాలు కోల్పోయి ఉంటుందని భావిస్తున్నారు. అనంతరం మృతదేహంపై మరోసారి లైంగిక దాడి చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. 
 
తర్వాత మృతురాలి ఒంటిపై ఉన్న వెండి పట్టీలు, బంగారు తాళిబొట్టును నిందితుడు అపహరించుకుపోయాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నిందితుడు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ వాసిగా గుర్తించారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.