సోమవారం, 15 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 జులై 2022 (09:42 IST)

జూలై 10 నుంచి ఓటీటీలోకి "అంటే.. సుందరానికీ"

ante sundaraaniki
నేచురల్ స్టార్ నాని, నజ్రీయా జంటగా మతాంతర వివాహం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'అంటే.. సుందరానికీ!'. ఈ రొమాంటిక్‌ కామెడీ సినిమా జులై 8 నుంచి ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌‌లో స్ట్రీమింగ్ కానుందంటూ ప్రచారం జరిగింది. కానీ, జులై 10న విడుదల చేస్తున్నట్టు ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. 
 
"సుందర్‌, లీల పెళ్లి కథ చూసేందుకు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. డేట్‌ సేవ్‌ చేసుకోండి. ‘అంటే.. సుందరానికీ!’ జులై 10న నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తుంది'' అంటూ పేర్కొంది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. 
 
థియేటర్ల వేదికగా జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాలోని నాని (సుందర్‌), కథానాయిక నజ్రియా (లీల) నటన, దర్శకుడు వివేక్‌ ఆత్రేయ టేకింగ్‌కు మంచి మార్కులు వచ్చిన విషయం తెల్సిందే.