శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 జూన్ 2022 (18:32 IST)

జూలై 8 నుంచి ఓటీటీలో విక్రమ్ సందడి

vikram
విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన "విక్రమ్" చిత్రం జూన్ 3వ తేదీన విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రం ఇప్పటికే రూ.400 కోట్ల మేరకు  వసూళ్లను రాబట్టింది. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శితమవుతుంది. ఈ క్రమంలో వచ్చే నెల 8వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ కొనుగోలు చేసి స్ట్రీమింగ్ చేయనుంది. 
 
కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించగా, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్‌లు కీలక పాత్రలను పోషించారు. హీరో సూర్య రోలెక్స్ పాత్రలో అతిథి పాత్రలో కనిపించి సినిమాకు హైలెట్‌గా నిలిచారు.