బాహుబలి కట్టప్పలా మారిన కాజల్ అగర్వాల్ (ఫోటో వైరల్)
హీరోయిన్ కాజల్ అగర్వాల్ బాహుబలి కట్టప్పలా మారింది. తన కుమారుడు నీల్ కిచ్లూతో కలిసి తీసిన ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. ఆ ఫోటోలు కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా కొడుకు నీల్ కిచ్లూతో కలిసి బాహుబలిలోని ఓ సీన్ రీక్రియేట్ చేయడం ఇప్పుడు వైరల్‌గా మారింది.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో కట్టప్ప తలపై బాహుబలి కాలుపెట్టే సీన్‌ని కాజల్ తన కొడుకు నీల్‌తో రీక్రియేట్ చేసింది.
దీనికి సంబంధించిన ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. 'రాజమౌళి సర్ ఇది నీల్, నేను మీకు అంకితమిస్తున్నాం' అంటూ ఫోటోను షేర్ చేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కాజల్ కమల్ హాసన్ హీరోగా చేస్తున్న ఇండియన్ 2లో త్వరలోనే రీఎంట్రీ ఇవ్వనుంది.