బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. రిపబ్లిక్ డే స్పెషల్
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 జులై 2022 (19:39 IST)

రసగుల్లాను తినిపిస్తూ ఆటపట్టించిన మరదలు.. అలా ముద్దుపెట్టుకున్న వరుడు..

Rasagulla
Rasagulla
వివాహ వేడుకలో మరదళ్లు ఏదో ఒక సాకుతో వరుడిని ఆటపట్టిస్తుంటారు. వరుడిని ఇబ్బంది పెట్టడం, బూట్లు దొంగిలించడం.. ఇంకా స్వీట్లు తినిపించే సమయంలో సరదాగా ఆటపట్టించడం ఇలా చాలానే జరుగుతుంటాయి. 
 
తాజాగా మరదలు అనుకోకుండా తనకు కాబోయే బావను ముద్దుపెట్టుకుంది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వారంతా కూడా బావను ఆటపట్టించడానికి సిద్ధమైనట్లు కనిపిస్తుంది. 
 
ఈ క్రమంలో ఓ మరదలు తనకు కాబోయే బావకి రసగుల్లాను తినిపించడానికి ముందుకు వస్తుంది. మరదలు తన చేతిలో రసగుల్లాను పట్టుకొని వరుడికి తినిపించే క్రమంలో ఆటపట్టించడానికి ప్రయత్నిస్తుంది. రసగుల్లా తినిపించడానికి మరదలు చేయి చాచగానే వరుడు.. ఆమె చెయ్యి పట్టుకుని తనవైపు లాక్కున్నాడు. 
 
రసగుల్లా తినే పోరాటంలో మరదలు.. వరుడు అనుకోకుండా ముద్దు పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఈ సన్నివేశాన్ని చూసి అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. వధువు కూడా ఈ సన్నివేశాన్ని చూసి షాకైంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.