గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 జులై 2022 (21:50 IST)

పుష్ప చేతుల మీదుగా రకుల్ ప్రీత్ సింగ్ మషూకా సాంగ్ రిలీజ్ (video)

Mashooka
Mashooka
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మషూకా అనే పార్టీ సాంగ్ ఆన్‌లైన్‌లో విడుదలైంది. కొద్ది కాలంలోనే భారీ విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ పాట తెలుగు, తమిళ వెర్షన్‌లను రిలీజ్ చేయడం జరిగింది.
 
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. "నాకు ఇష్టమైన రకుల్‌ ప్రీత్‌తో పాటు టీమ్‌ మొత్తానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నాకు ఇష్టమైన మొదటి మ్యూజిక్ వీడియో మషూకాను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. ఇది మీ అందరి హృదయాలను తాకుతుందని ఆశిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు. 
 
మషూకా కి తనిష్క్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు. ఆదిత్య అయ్యంగర్ మరియు అసీస్ కౌర్ పాడారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ప్రైవేట్ సాంగ్‌లో రకుల్ ప్రీత్ రెచ్చిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.