గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 జులై 2022 (11:06 IST)

తమిళనాడులో మరో స్కూల్ విద్యార్థిని ఆత్మహత్య

suicide
తమిళనాడు రాష్ట్రంలో మరో స్కూలు విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శివకాశిలో 11వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంమది. ఈ ఘటన మంగళవారం జరిగింది. 
 
బాలిక తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, ఈ ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. మరోవైపు, ఈ బాలిక తరచుగా కడుపునొప్పితో బాధపడుతూ వచ్చింది. ఈ నొప్పిని భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. 
 
కడలూరు జిల్లాలో 12వ తరగతి విద్యార్థిని చనిపోయిన కొన్ని గంటల వ్యవధిలోనే శివకాశిలో  విద్యార్థిని ప్రాణాలు తీసుుకంది. దీంతో గత రెండు వారాల్లో ముగ్గురు ప్లస్ టూ విద్యారఅథులు, ఒక ప్లస్ వన్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ వరుస ఆత్మహత్యలు రాష్ట్రంలో పెను కలకలం సృష్టిస్తున్నాయి.
 
మరోవైపు, రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఆత్మహత్యలపై సీఎం స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థినులు ఆత్మహత్య ఆలోచనలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. పరీక్షలను విజయవంతంగా మార్చుకోవాలని, విద్యార్థినులపై లైంగిక, మానసిక, శారీరక వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.