ఆదివారం, 3 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 జులై 2022 (09:07 IST)

యూట్యూబ్‌కు లైక్స్ రావడం లేదని ట్రిబుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య.. ఎక్కడ?

తాను ప్రారంభించిన యూట్యూబ్ గేమ్ చానెల్‌కు లైక్స్ రావడం లేదని ఐఐఐటీ విద్యార్థి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. తాను నివాసం ఉండే ఐదో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని సైబరాబాద్ ఠాణా పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి ప్రాంతానికి చెందిన చంద్రశేఖరన్, శంకరీ దంపతులు గత పదేళ్లుగా హైదరాబాద్ నగరంలో ఉంటున్నారు. చంద్రశేఖరన్ రైల్వేలో ఎలక్ట్రిక్ మెయింటెన్స్ విభాగంలో పని చేస్తుంటే శంకరీ డీఆర్డీవోలో శాస్త్రవేత్తగా ఉన్నారు. వీరికి ఒకే ఒక కుమారుడు సి.దీనా (21). వీరంతా సైదాబాద్ డివిజన్ క్రాంతి నగరులోని ఆదర్శ్ హైట్స్ రెండో అంతస్తులో ఉంటున్నారు. 
 
దీనా గ్వాలియర్‌లోని ఐఐఐటీలో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల పరీక్షలు రాసి నగరానికి వచ్చి ఇంటివద్దనే ఉంటున్నారు. ఉన్నట్టుండి గురువారం తెల్లవారుజామున ఐదో అంతస్త నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణ జరుపుతున్నారు. 
 
అయితే, దీనా రాసిన ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాను ప్రారంభించిన యూట్యూబ్ చానెల్‌కు లైక్స్ రావడం లేదన్న మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు పేర్కొన్నారు. పైగా, బుధవారం రాత్రి నుంచి యూట్యూబ్‌లో తాను రూపొందించిన సెల్ఫీ గేమ్ ఆడుతూ తన బాధను వీక్షకులు చెబుతూనే గురువారం తెల్లవారుజామున భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఆదర్శ్ హైట్స్‌లోని రెండో అంతస్తులో తన తల్లిదండ్రులు, మొదటి అంతస్తులో అమ్మమ్మ, తాతయ్యలు నివసిస్తున్నప్పటికీ తాను ఎపుడూ ఒంటరివాడిగాన భావించానని దీనా ఆత్మహత్య లేఖలో పేర్కొన్నారు.