గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 జులై 2022 (14:46 IST)

హైదరాబాద్ నగరంలో జోరుగా కల్తీ పెట్రోల్ విక్రయం

water mixed petrol
హైదరాబాద్ నగరంలో జోరుగా కల్తీ పెట్రోల్ విక్రయం సాగుతోంది. అనేక పెట్రోల్ బంకుల్లో కల్తీ పెట్రోల్ విక్రయాలు యధేచ్చగా సాగుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. పలు చోట్ల నీళ్లు కలిపిన పెట్రోల్ విక్రయిస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దేశంలో ప్రస్తుతం పెట్రోల్ ధరలు సెంచరీని దాటిపోయాయి. ఇదే అదునుగా భావించిన కొన్ని పెట్రోల్ బంకుల యజమానులు రెండు చేతులా సంపాదించుకునేందుకు పెట్రోల్‌లో నీళ్లు కలిపి విక్రయిస్తున్నారు. తాజాగా రాజేంద్ర నగర్‌లో ఈ కల్తీ పెట్రోల్ విక్రయం కలకలం రేపింది. 
 
అలాగే ఉప్పర్‌పల్లిలోని బడేమియా పెట్రోల్ బంకులో పెట్రోల్‌లో నీళ్లుపోసి విక్రయిస్తున్నారు. బంకుకు వచ్చే వాహనదారులకు కల్తీ పెట్రోల్‌ను వాహనదారులు విక్రయిస్తున్నారు. వాహనాల నుంచి నీళ్ళతో కలిసిన పొగరావడంతో వాహనదారులు ఈ విషయాన్ని పసిగట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
పెట్రోల్ కల్తీకి పాల్పేడ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత వాహదారులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు పలు పెట్రోల్ బంకులకు వెళ్లి కల్తీ పెట్రోల్‌ శాంపిల్స్ తీసుకుని పరిశీలిస్తున్నారు.