సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 జులై 2022 (21:21 IST)

మెట్రో రైల్వే స్టేషన్ వద్ద స్టెప్పులేసిన అమ్మాయి... చివరికి ఏమైందంటే?- video

Dance
Dance
సోషల్ మీడియా పిచ్చి మామూలుగా లేదు. చాలామంది రీల్స్  చేస్తూ ఎంజాయ్ చేయడంతో పాటు వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ లైకులు సంపాదిస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ రీల్స్ కోసం స్టెప్పులు వేసేస్తున్నారు. 
 
తాజాగా ఓ అమ్మాయికి హైదరాబాద్ మెట్రో రైల్వేస్టేషన్ బాగా నచ్చినట్టుంది. దీంతో అక్కడ ఆమె రీల్స్ చేసింది. రారా.. అనే సాంగ్‌కు యువతి డ్యాన్స్ చేసి, దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. 
 
ఇది కాస్త మెట్రో రైలు అధికారుల కంటపడింది. దీంతో స్టేషన్‌లో యవతి చిందులు వేయడంపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. త్వరలోనే యువతిపై చర్యలు తీసుకుంటామని మెట్రో అధికారులు పేర్కొన్నారు.  లైక్‌ల కోసం డ్యాన్స్ చేసి యువతి చిక్కుల్లో పడిందన్నమాట.